Bijibilla’s Substack
Thathvamulu
Phalamu
0:00
Current time: 0:00 / Total time: -5:26
-5:26

LYRICS : PHALAMU

పల్లవి : ఫలము, పుష్పము, పత్రము, తోయము "2"

ఏదైనను, నాస్వామి, చిరునగవులు చిందించు

అ.ప : సర్వాయుధిని మనసున నిలుపుము "2"

తనకు అదియే నిజమైన అర్చనము "ఫలము"

చరణం : కొండంత స్వర్ణ భాండమైనను

కానగ, చిరు కానుక అయిననూ "2"

ఏదైనను, తార తమ్యములు లేవులే! "2"

ఎవరి కైనను, వసుడగున లే! "ఫలము"

చరణం : భూపాలురు, మరియు పామరులు

కడు బీదలు, ఘన కామందులు "2"

ఎవరైనను, ఎవరి చేత నైనను "2"

సమ సేవల సముడు, నగ ధరుడు "ఫలము"

చరణం : భావమె గాని, ధన సంపత్తి కాదని

తర తమ బేధమే లేదని "2"

ఎవరు సర్వ మర్పించి కొలుతురో "2"

పర దైవము, వారి మదిన కొలువగును "ఫలము"

Discussion about this podcast

Bijibilla’s Substack
Thathvamulu
This play list is part of Sudhanva Sankirtanam (Devotional & Spiritual) Album
Listen on
Substack App
RSS Feed
Appears in episode
Bijibilla Rama Rao