LYRICS : BHAYAMELA
పల్లవి : భయమేల! ఇక భయమేల అభయ హస్తుడే వుండగా "2"
అ.ప : ఆదియు, అంతము అతడే కాదా భయ మేలనె మనసా! "భయ"
చరణం : భారమేల! నీ చెంతన బంధ విముక్తుడు వుండగ
ఆధారమేల! మరి భూతభావనుడు , నీతోడు వుండగ "2"
యోచనేలనే మనసా! యుగపురుషుడు వుండగ
సంకోచ మేలనే మనసా! సంకర్షుణుడుండగ "2" "భయ"
చరణం : పర దైవమేల మనసా! హరి వెన్నంటే వుండగా
పర మొసగు వరదు డీతడు, పురుషోత్తము డీతడు "2"
పురుషార్థ మతడు మనసా! అర్థము తానవునుగ
పరమ పురుషుడు మనసా! మన పరమే తానుగ "2" "భయ"
Share this post