LYRICS
యుగములు
పల్లవి : యుగములు, కాలగతులు మారినను "2"
నగధరుడేస్థిరము, ఇదినిజము "2" "యుగములు"2"
చరణం : చరితలు, కాలగర్భమున కలసినను "2"
చరితాత్ముడే నిజమగు నిత్యము
మనుజులు, కాలగమనమున మారినను "2"
మహితాత్ముడే, మహిలోనతధ్యము "యుగములు"
చరణం : ఈతడి సమమగు,దైవమును కనలేము "2"
సమసి పోని, నిధియు నిధానము
సమపాలకుడు, సరసిజనయనుడు "2"
సాగరశయనుడు, సర్వాత్వకుడును “యుగములు"
Share this post