Bijibilla’s Substack
Thathvamulu
Yeruganaithini
1
0:00
-6:53

Yeruganaithini

1

LYRICS : YERUGANAITHINI

పల్లవి : ఎరుగనైతిని, కడకు నేనెవరినని "2" నీ చేతయు నేనని,

నీ సృష్టియును నేనని ఎరుగనైతిని, ఎరుగనైతిని, ఎరుగనైతిని, ప్రభూ! "ఎరుగ"

చరణం : "నాది" యని, నే దానము సేయగ ధర్మము సేయ, నేనెవరిని తండ్రీ! "2"

"నీది" అంతయు "నాది" యని తలచుచు "2" సంబరపడుదునే! సర్వాత్మా! "ఎరుగ"

చరణం : వేడుకలందున నా ఘనతేయని సంతసమంతా, నా సొంతమనుకొంటి "2"

ఓర్వగలేని పెను ఇక్కట్లు కలిగిన "2" నా కర్మ ఫలమని తలువగజాలా! "ఎరుగ"

చరణం : ఆత్మలోన పరమాత్మ యుండునని జీవితమంతా సత్కర్మలకేనని "2"

తెలిసి, నే గన్నులు, తెరచితిని, స్వామీ! "2" నమ్మితి, నీ సేవ కొరకే నేనని "ఎరుగ"

Discussion about this episode

User's avatar