LYRICS : VRELUPATTI
పల్లవి : వ్రేలుపట్టి, నడిపించెడి దైవము వెనుకకు మరలి, యోచించని దైవము
అ.ప. : ఎల్ల తావుల, నిండిన దైవము ఎల్ల త్రోవల, యుండెడి దైవము [వ్రేలు] [2]
చరణం : దుర్జనుల మనముల నిండిన దైవము సజ్జనుల పాలి, చల్లని దైవము [2]
ముజ్జగములకు, మూలము దైవము ముని గణములకు, ముంగిటిదైవము [వ్రేలు]
చరణం : ముడుల త్రోవలలోన, విడుపుల దైవము లోగిళ్ళలో, ముక్తి దోసిళ్ళ దైవము [2]
దీనులపాలిటి, ఆది దైవము ఆధీన మగుదుము, అతడికి మనము [వ్రేలు]
Share this post