Playback speed
×
Share post
Share post at current time
0:00
/
0:00
Transcript

Nenentha Agnudanu

It is part of Sudhanva Sankirtanam - Thathvams Play List. Lyrics : Lakshmi Valli Devi Bijibilla. Music : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.

LYRICS : NENENTHA AGNUDANU

పల్లవి : నేనెంత అజ్ఞుడను? నీ యునికి వెదుక "2"

అ.ప. : అంతట నీవె, నిండియుండిన స్వామి "నేనెంత"

చరణం : అణువణువూ నీవె, పరమాణువు నీవె "2"

గిరులు, తరులు, పూవనముల నీవె

పూలను దాగిన మక రందము నీవె "2"

అద్భుతము, నీజేత! వచియింపగ స్వామి "నేనెంత"

చరణం : జలపాతముల నీవె, జలమున నీవె "2"

జల చరముల నీవె, చరాచరము నీవె

పిన పాపలలోని, ముసినవ్వులు నీవె "2"

ఊయల లూగేవు, తల్లిలాలిలో నీవె "నేనెంత"

చరణం : పిల్ల తెమ్మెరలు, పెనుగాలుల నీవె "2"

పూబాలలో, శిరసూయల నీవె

హిమ బిందువు నీవె, బడ బాగ్నియు నీవె "2"

నాలోని నిన్ను, నలుదిశల వెదకేటి "నేనెంత"

Discussion about this podcast

Bijibilla’s Substack
Thathvamulu
This play list is part of Sudhanva Sankirtanam (Devotional & Spiritual) Album
Listen on
Substack App
RSS Feed
Appears in episode
Bijibilla Rama Rao